భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ భారత్ బంద్ కొనసాగనుంది. కార్మిక సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కొనసాగనుంది. కేంద్ర విధానాలు వ్యతిరేకిస్తూ పది కార్మిక సంఘాలు అలాగే అనుబంధ సంఘాల ఐక్యవేదిక.. ఈ మేరకు ప్రకటన చేసింది. ఇవాళ భారత్ బంద్ పాటించాలని వెల్లడించింది. బ్యాంకింగ్, పోస్టల్ అలాగే ఇన్సూరెన్స్ లాంటి రంగాలకు చెందినవారు బంద్ లో పాల్గొననున్నారు.

ఇవాళ భారత్ బంద్ ఉన్న నేపథ్యంలో… విద్యా సంస్థలకు హాలిడే ఉందని జోరుగా ప్రచారం చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ యధావిధిగా స్కూళ్లు, కాలేజీలు యధావిధిగా నడుస్తాయని చెబుతున్నారు అధికారులు. బంద్ కు ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయ సంఘాలు… ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆటో విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే ప్రైవేట్ స్కూళ్లు… బంద్ ప్రకటిస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ ఇవాళ కార్మిక సంఘాలు మాత్రమే బంద్ లో పాల్గొంటున్నాయి. దీంతో ప్రైవేట్ స్కూల్స్ కూడా తెరిచే ఉండనున్నాయి.