అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ నివేదిక దేశంలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పార్లమెంటులో ఈ రగడ రోజూ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని లేదా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని గత కొన్ని రోజులుగా పార్లమెంట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ తరుణంలో ఇవాళ అదానీ ఆర్థిక వ్యవహారాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిపారు. ఈ సందర్భంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ కమిటీలో సభ్యులుగా ఎవరు ఉండాలో సుప్రీం కోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్రం పేర్కొంది. ఇక ఈ కేసును ఫిబ్రవరి 17వ తేదీకి వాయిదా వేశారు.