BREAKING : బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా

-

BREAKING : బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు బీహార్ గవర్నర్ ఆఫీసు కీలక ప్రకటన చేసింది. కాసేపటి క్రితమే…బీహార్ గవర్నర్ విశ్వనాధ్ అర్లేకర్ ను కలిసి రాజీనామా చేశారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.

Bihar CM and JD(U) president Nitis Kumar Resigned

అనంతరం నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్పానించాలని జేడి-యు జాతీయ అధ్యక్షుడు నితీష్ కుమార్ కోరారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీహార్‌ సీఎంగా మళ్లీ నితీష్‌ ప్రమాణం చేయనున్నారు. దీంతో 9వ సారిగా బీహార్‌ సీఎంగా నితీష్‌ ప్రమాణం చేయనున్నారన్న మాట.

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు పట్నాలోని పార్టీ కార్యాలయంలో సమావేశయ్యారు. ఇప్పటి వరకు నీతీశ్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై తమకు పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సమాచారం లేదని బీజేపీ ఎమ్మెల్యే మోతీలాల్‌ ప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version