బిహార్ లో పొలిటికల్ హీట్.. గవర్నర్‌ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం నీతీశ్

-

బిహార్‌లో రాజకీయం క్షణక్షణాకి హీటెక్కుతోంది. ఇక్కడి రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఎన్డీఏ కూటమితో చేయి కలిపి కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చనున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం నీతీశ్‌ కుమార్‌ గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా సమర్పించే అవకాశం ఉందని సమాచారం.

బీజేపీతో కలిసి బిహార్లో ఇవాళ సాయంత్రం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకొని ఎన్డీఏతో జట్టు కట్టేందుకు నీతీశ్ రంగం సిద్ధం చేసుకున్నట్లు తాజా పరిణామాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు పట్నాలోని పార్టీ కార్యాలయంలో సమావేశయ్యారు. ఇప్పటి వరకు నీతీశ్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై తమకు పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సమాచారం లేదని బీజేపీ ఎమ్మెల్యే మోతీలాల్‌ ప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేననని వ్యాఖ్యానించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version