బీజేపీకి మళ్లీ ఓటేస్తే విధ్వంసం కొనితెచ్చుకున్నట్లే : నితీశ్ కుమార్

-

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే విధ్వంసాన్ని కొనితెచ్చుకున్నట్లేనని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యం కోసం తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. విపక్షాల ఐక్యం చేసే దిశగా కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నేతలతో తాను భేటీ అయినట్లు నీతీశ్‌ వెల్లడించారు.  మతపరంగా సమాజాన్ని చీల్చడం తప్ప ఈ దేశానికి బీజేపీ  చేసిందేమీ లేదని మండిపడ్డారు. అందుకే ఆ పార్టీ చరిత్రను మార్చాలనకుంటోందని ఆరోపించారు.

‘‘విపక్షాల ఐక్యత కోసం నేను పనిచేస్తున్నా. నేనైతే ప్రధాని మంత్రి పదవికి పోటీలో లేను. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు విపక్షాలను ఒక తాటిపైకి వస్తున్నాయి. ప్రస్తుతానికి నా ముందున్న ఒకే ఒక్క లక్ష్యం భాజపాను మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే బీజేపీకి ఓటు వేస్తారో వారు తమతో పాటు దేశానికీ విధ్వంసాన్ని కొనితెచ్చినట్లే. కేంద్ర రాష్ట్రాల్లో సుపరిపాలన కావాలంటే విపక్షాలకు ఓటు వేయాలి’’ అని నితీశ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version