25ఏళ్లకే ఎంపీగా శాంభవి.. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు

-

లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్​డీఏ మెజార్టీ మార్క్​ను సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సార్వత్రిక పోరులో చాలాచోట్ల అనూహ్య ఫలితాలు వచ్చాయి. నార్త్- వెస్ట్ ముంబయిలో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే వర్గం అభ్యర్థి రవీంద్ర వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. బిహార్​లోని సమస్తీపుర్​లో ఎల్​జేపీ(ఆర్) తరఫున గెలిచిన శాంభవి చౌదరీ దేశంలోనే అత్యంత పిన్న వయసు ఎంపీగా నిలిచారు.

బిహార్​లో ఎన్​డీఏ మిత్రపక్షమైన ఎల్​జేపీ(ఆర్) సత్తా చాటింది. 5 స్థానాల్లో చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఆ పార్టీ జయకేతనం ఎగుర వేసింది. ఎల్​జేపీ(ఆర్) తరఫున సమస్తీపుర్ నుంచి పోటీ చేసిన శాంభవీ చౌధరీ కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై 1,87,537 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇలా దేశంలోనే పిన్న వయస్కురాలైన ఎంపీగా నిలిచారు. ఎంపీగా ఎన్నికైన నాటికి శాంభవి వయసు (25ఏళ్ల 11 నెలల 20 రోజులు)మాత్రమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version