సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. బిల్కిస్ బానో దోషులకు క్షమాభిక్ష రద్దు

-

బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై నమోదైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. ఆ దోషులకు గుజరాత్ సర్కార్ ప్రసాదించిన క్షమాభిక్షను రద్దు చేసింది. క్షమాభిక్ష ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఈ అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.

దోషికి సంబంధించిన విచారణ, జైలు శిక్ష విధింపు ఎక్కడైతే జరిగిందో అక్కడే క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్​తో కూడిన అత్యున్నత ధర్మాసనం ఇవాళ తీర్పు చెప్పింది. క్షమాభిక్ష నిర్ణయంపై పునరాలోచన చేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది. అనేక విషయాలను బహిర్గతం చేయకుండా ఆ ఉత్తర్వులు సంపాదించుకున్నారని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం  పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news