బీజేపీని కరుణించని రామయ్య.. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లో పరాభవం

-

2024 సార్వత్రిక ఎన్నికల్లో అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటూ నినదించిన బీజేపీ ఈ ఎన్నికల్లో కనీసం 300 సీట్లు కూడా సాధించలేకపోయింది. బీజేపీకి ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చింది. అయోధ్య రాముడి ఆలయాన్ని నిర్మించామన్న నినాదం ఎత్తుకుని ప్రచారంలో దూసుకెళ్లిన బాలరామయ్య భారతీయ జనతా పార్టీని కరుణించలేదు. రామ్ మందిర్ అంశం బీజేపీకి కలిసి రాలేదు. నిజానికి, రామమందిర నిర్మాణం మొత్తం పూర్తి కాకముందే ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించారనే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో యూపీలో అయోధ్య రాముడు కొలువైన ఉన్న ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోనూ బీజేపీ ఓటమి పాలయ్యింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్‌ ప్రసాద్‌ విజయం సాధించారు. మరోవైపు యూపీలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఇక్కడ బీజేపీ 36 సీట్లలో గెలవగా ఇండియా కూటమి 43 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఒక స్థానాన్ని ఇతరులు దక్కించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version