పెద్దనోట్ల రద్దుపై సుప్రీం తీర్పు.. రాహుల్ సారీ చెబుతారా అంటూ బీజేపీ ప్రశ్న

-

పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఇది దేశ ప్రయోజనాల కోసం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుగా అభివర్ణించింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కాంగ్రెస్‌పై ఈ సందర్భంగా బీజేపీ ఫైర్ అయింది. రాహుల్ గాంధీ ఇప్పుడు క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించింది.

2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన సుప్రీం కోర్టు ఇవాళ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోన్న రాహుల్‌ గాంధీ ఇప్పుడు క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు. ఆయన దీన్ని తప్పుబడుతూ విదేశాల్లోనూ ప్రసంగాలు చేశారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఊపందుకున్న డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ అగ్రగామిగా నిలుస్తోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version