ఇదేందయ్యా ఇది.. కల్వర్టుతో బాలుడి వివాహం

-

ఝార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్‌లో ఓ వింత పెళ్లి జరిగింది. గిరిజన సంప్రదాయం ప్రకారం ఓ బాలుడికి కల్వర్టుతో వివాహం జరిపించింది ఓ కుటుంబం. మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు గిరిజనులు అఖన్న జాతర జరుపుకొంటారు. చెట్టుకు లేదా కల్వర్టుకు చిన్నారులను ఇచ్చి వివాహం జరిపించడం వీరికి సంప్రదాయంగా వస్తోంది. పిల్లలకు తొలి దంతం పైదవడకు వస్తే.. వారికి ఇలా వివాహం జరిపిస్తారు. లేదంటే అశుభం జరుగుతుందని నమ్ముతుంటారు.

కల్వర్టు, చెట్టుకు వివాహం జరిపించకపోతే వివాహం అయిన తర్వాత ఆ వ్యక్తి భాగస్వామి వెంటనే మరణిస్తారని విశ్వసిస్తుంటారు. అందుకే, అలాంటి చిన్నారులకు ఐదేళ్ల వయసు వచ్చే లోపే కల్వర్టులు, చెట్లకు ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. తూర్పు సింగ్భూమ్‌ జిల్లాలోని పోట్కా ప్రాంతానికి చెందిన సరీ సింగ్‌ సర్దార్‌.. తన మనవడికి వివాహం జరిపించారు. చిన్నారిని పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి.. బొమ్మ బైక్‌పై ఊరేగిస్తూ కల్వర్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడే వివాహ తంతు జరిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version