బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వినియోగ దారులకు గుడ్ న్యూస్. రాబోయే 6-8 నెలల్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లో దేశీయంగా అభివృద్ధి చేసిన 5జి వ్యవస్థను వినియోగించే అవకాశం ఉందని ప్రభుత్వరంగ సంస్థ సీ-డాట్ సీఈఓ రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. 5జి స్టాండలోన్ రేడియో, కోర్ అండ్ ఐపి మల్టీమీడియా సిస్టంను దేశంగా అభివృద్ధి చేసినట్టు తెలిపారు.
తాము అభివృద్ధి చేసిన 5జీ గేర్లతో కూడిన నెట్వర్క్ ను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో ప్రధాని వీడియోకాల్ వినియోగించినట్లు వెల్లడించారు. పంజాబ్ బిఎస్ఎన్ఎల్ సర్కిల్ లో 4జి, 5జి నాన్ స్టాండలోన్ కోర్ వ్యవస్థలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. క్రమంగా దీన్ని దేశం అంతటా విస్తరిస్తున్నట్లు తెలిపారు. దేశీయంగా 4జీ సేవలను ఈ ఏడాది డిసెంబర్లో, 5జీ సేవలను 2024 జూన్ తర్వాత ప్రవేశపెడతామని బిఎస్ఎన్ఎల్ సిఎండి పీకే పూర్వార్ వివరించారు.