కుప్పకూలిన భవనం.. 8 మంది మృతి

మహారాష్ట్రను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మ‌హారాష్ట్ర‌లో వ‌రుస ప్ర‌మాదాలు చోటు చేసుకుంటుడం ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. మొన్న‌టికి మొన్న ఓ ఐదంస్తుల భ‌వనం కుప్ప‌కూలిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మ‌రో భ‌వనం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌ భీవండి నగరంలో చోటు చేసుకుంది. ఈ న‌గ‌రంలోని మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందారు.

వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు సుమారు 20 మందిని రక్షించారు. అయితే.. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విష‌యం తెలిసిన వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న అధికార సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నాయి. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే.. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.