విజ‌య్ మాల్యా కోసం వేచి చూడ‌లేం.. జ‌న‌వ‌రి 18 న శిక్ష – సుప్రీం కోర్టు

బ్యాంకుల వ‌ద్ద రుణాలు తీసుకుని విదేశాల‌కు పారిపోయిన విజ‌య్ మాల్యా కోసం తాము ఇక వేచి చూడ‌లేమ‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు అంది. విజ‌య్ మాల్యా రాకున్న ఆయ‌న కు జ‌న‌వ‌రి 18 న శిక్ష వేస్తామ‌ని సుప్రీం కోర్టు తెల్చి చెప్పింది. అంతే కాకుండా విజ‌య్ మాల్యా పై సుప్రీం కోర్టు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కాగ ప‌లు బ్యాంకు ల‌లో రుణాలు తీసుకుని మోసం చేసి బ్రిట‌న్ కు విజ‌య్ మాల్యా పారిపోయాడు.

చాలా రోజుల నుంచి విజ‌య్ మాల్యా ను ఇండియా కు రప్పించాల‌ని భార‌త ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంది. కానీ విజ‌య్ మాల్యా మాత్రం బ్రిట‌న్ నుంచి రావ‌డం లేదు. అయితే భార‌త ప్ర‌భుత్వ బ్రిట‌న్ లో నూ కేసు పెట్టి ఇండియా కు రప్పించాల‌ని చూస్తుంది. ఇదే విష‌యాన్ని భార‌త ప్ర‌భుత్వం సుప్రీం కోర్టు లో తెలిపింది. విజ‌య్ మాల్యా ను ఇండియా కు తీసుకు వ‌చ్చే ప్ర‌క్రియా చివ‌రి ద‌శ లో ఉంద‌ని తెలిపింది.