రాహుల్‌ గాంధీ యాత్రపై కేసు నమోదు

-

కేంద్రంలో మోదీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్రపై కేసు నమోదైంది. ఈ యాత్ర మార్గంపై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ అసోం పోలీసులు దీనిని నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ నుంచి రాహుల్‌ నేతృత్వంలో మొదలుపెట్టిన ఈ యాత్ర గురువారం అసోంకు చేరుకుంది.

గురువారం రోజున న్యాయయాత్ర జోర్హాట్‌ పట్టణం చేరుకున్న సమయంలో కేటాయించిన మార్గంలో కాకుండా నిర్వాహకులు మరోవైపు వెళ్లారని అసోం పోలీసులు తెలిపారు. ఈ మార్పు పట్టణంలో అంతరాయాలకు దారి తీసిందని చెప్పారు. ట్రాఫిక్‌ బారికేడ్లను తొలగించేలా పోలీసులపై దాడి చేసేలా ప్రజలను నేతలు రెచ్చగొట్టారని.. యాత్ర, యాత్ర నిర్వాహకులపై ఈ కేసు నమోదైనట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇదంతా యాత్రకు అడ్డంకులు సృష్టించే యత్నమని విమర్శించారు. తమకు కేటాయించినది ఇరుకైన మార్గమని.. మరోవైపు రద్దీ ఎక్కువగా ఉందని కొద్దిదూరం పక్కమార్గంలో ప్రయాణించామని తెలిపారు. అసోంలో యాత్ర విజయంతంగా సాగడంతో ఆందోళనలో ఉన్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దానిని దారిమళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version