మణిపుర్ విద్యార్థుల హత్యపై సీబీఐ దర్యాప్తు.. నిందితులను వదిలేదే లేదన్న సీఎం

-

జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. ఇంటర్నెట్ పునరుద్ధరించినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో గతంలో జరిగిన దారుణాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వారి ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మళ్లీ.. మణిపుర్ ప్రభుత్వం ఇంటర్నెట్​పై మళ్లీ నిషేధం విధించింది. పాఠశాలలకు కూడా శుక్రవారం వరకు సెలవులు ప్రకటించింది.

మరోవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్పందించారు. ఆ విద్యార్థులను హత్య చేసిన నిందితులను వదిలేదే లేదని స్పష్టం చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐ బృందం ఈరోజు ఇంఫాల్​కు చేరుకోనుందని.. సీబీఐ డైరెక్టర్​తో పాటు బృందం.. ప్రత్యేక విమానంలో ఇవాళ ఉదయం రాష్ట్రానికి రానున్నట్లు సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. అత్యంత దారుణానికి పాల్పడ్డ హంతకులను కోర్టు ముందుకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version