కార్మికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

-

కరోనా వైర‌స్ క‌ట్ట‌డికి విధించిన‌ లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ)లో సభ్యులుగా ఉండి లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు మూడు నెలల పాటు నిరుద్యోగ భృతి ఇవ్వనుంది. ఒక్కో నెల వేతనంలో 50 శాతాన్ని నిరుద్యోగ భృతిగా చెల్లించనుంది. అయితే.. దేశంలో లాక్‌డౌన్‌ మొదలైన మార్చి 24 నుంచి ఈ ఏడాది డిసెంబర్‌ 31 మధ్య 90 రోజుల కాలవ్యవధికి కార్మికులు నిరుద్యోగ భృతికి అర్హులు అవుతారు.

అయితే దీనికి కొన్ని కండిష‌న్లు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు 2018 ఏప్రిల్‌ 1నుంచి 2020 మార్చి 31 మధ్య రెండేండ్లు ఈఎస్‌ఐ సభ్యులుగా ఉండాలి. 2019 అక్టోబర్‌ 1నుంచి 2020 మార్చి 31మధ్య కనీసం 78 రోజులు చందా (తమ వంతు కంట్రిబ్యూషన్‌ మొత్తం) చెల్లించినవారే నిరుద్యోగ భృతికి అర్హులని కేంద్రం పేర్కొంది. నిజానికి ఈఎస్‌ఐసీ నిబంధనల ప్రకారం.. ఈఎస్‌ఐ సభ్యుడైన ఉద్యోగి ఏదైనా కారణాలతో తన ఉద్యోగం కోల్పోతే 90 రోజులపాటు 25 శాతం వేతనం చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. దీనిని కేంద్రం ప్రస్తుతం 50 శాతానికి పెంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version