ఈ మధ్య కాలంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. వాహనదారులు నెమ్మదిగా, జాగ్రత్తగా వాహనాలను నడపాలని అధికారులు ఎన్ని సూచనలు చేసినా వాటిని పట్టించుకోకుండా అతివేగంతో ప్రయాణించి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం వందలాది మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోతున్నారు.
ఈ తరుణంలోనే కేంద్రం ఓ సరికొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి డ్రైవింగ్ స్కూల్ లో లో ఈ ప్రక్రియను అంతా పూర్తి చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు టెస్ట్ లో ఉత్తీర్ణత సాధిస్తే.. స్కూళ్లు వారికి ధ్రువపత్రం అందజేస్తాయి. అయితే వాటితో పాటు ఆర్టీవో కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవాలి. ఇటీవలే కేంద్రం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు జూన్ 01 నుంచి అమలులోకి రానున్నాయి.