కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. వీటిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. బీహార్ లో 5 జాతీయ, 4 రాష్ట్ర రహదారులను కలపనున్నది కారిడార్.
త్వరలో ఎన్నికలు జరిగే బీహార్ కి పలు ప్రాజెక్టులక కేంద్రం ఆమోదం తెలిపింది. కోచి–మేచి నదుల అనుసంధానం చేయనున్నారు. బీహార్ లో ఎన్నికల నేపథ్యంలో బీహార్ కి అధిక నిధులు కేటాయిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. మరోవైపు తెలంగాణ కి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందని పలువురు పేర్కొనడం గమనార్హం. మరో వైపు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పలు కీలక విషయాలను వెల్లడించారు.