రైతులకు మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. రూ.6వేలు కాదు.. ఇక నుంచి రూ.8వేలు..!

-

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. అయితే కేంద్రం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ ని అందిస్తోంది. ఈ స్కీమ్ వలన చక్కటి లాభాలని పొందొచ్చు.

చాలా మంది ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రయోజనాలని పొందుతున్నారు. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందుతోంది. ఈ స్కీమ్ ద్వారా ప్రతీ సంవత్సరం కూడా రైతులకి రూ. 6 వేలు వస్తున్నాయి. ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మూడు విడతలుగా ఈ డబ్బులు ఇస్తున్నారు.

డీబీటీ ద్వారా రైతుల ఖాతాకు బదిలీ చేస్తున్నారు. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఇప్పటికే 12వ విడత తో డబ్బులు అందాయి. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ డబ్బులు కోసం రైతులు చూస్తున్నారు. ఈ డబ్బులు జనవరి 20 తర్వాత పడతాయని తెలుస్తోంది. అయితే, ఈ సారి బడ్జెట్‌ లో ప్రతి రైతుకు రూ.8 వేల చొప్పున ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేసిందట కేంద్రం. దీని కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసిందట. వచ్చే ఏడాది చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో.. ఆ దిశగా అడుగులు వేస్తోంది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version