ఎట్టిపరిస్థితుల్లోనూ పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోబోం : కేంద్రం

-

ఎట్టిపరిస్థితుల్లోనూ విదేశాల నుంచి పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయంగా అందుబాటులో ఉన్న వనరులనే వినియోగించుకొని సరఫరాను మెరుగుపరుస్తామని తెలిపింది. పాల ఆధారిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకోబోతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అలా చేస్తే దేశీయ పాడి పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పశుసంవర్ధక, డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తం రుపాలా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

దేశీయంగా వెన్న, నెయ్యి సహా ఇతర డెయిరీ ఉత్పత్తుల నిల్వలు తగ్గాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో అవసరమైతే.. కేంద్ర ప్రభుత్వం వీటిని దిగుమతి చేసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో పాల ఉత్పత్తుల కొరత లేదని.. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ దిగుమతి మాత్రం చేసుకోబోమని స్పష్టం చేశారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందన్నారు. దేశీయంగా పాల ఉత్పత్తులకు గిరాకీ పుంజుకుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version