జనాభా భారాన్ని తగ్గించడంపై కేంద్రం ఫోకస్.. 8 కొత్త సిటీల ఏర్పాటుకు నయాప్లాన్

-

మన దేశంలో ఇప్పటికే సుమారు నాలుగు వేలకుపైగా నగరాలు ఉన్నాయి. అయితే త్వరలో మరో ఎనిమిది కొత్త నగరాలు పెరగనున్నాయట. అదేంటనుకుంటున్నారా.. జనాభా భారాన్ని తగ్గించే దిశగా ఆలోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

మధ్యప్రదేశ్​ ఇండోర్​లో ఇవాళ ‘అర్బన్​ 20’ సమావేశం తర్వాత కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ జీ20 యూనిట్​ డైరెక్టర్​ ఎంబీ సింగ్​ మీడియాతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసిందని ఆయన తెలిపారు. “ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు తర్వాత.. పలు రాష్ట్రాలు 26 కొత్త నగరాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. ఆ తర్వాత ఎనిమిది కొత్త నగరాల ఏర్పాటుకు అధికారులు పరిశీలిస్తున్నారు” అని ఎంబీ సింగ్​ చెప్పారు. కొత్త నగరాల ఏర్పాటుకు చెందిన పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని ఎంబీ సింగ్​ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version