BREAKING: చంద్రుడిపై మరోసారి ల్యాండింగ్.. వీడియో రిలీజ్

-

BREAKING: చంద్రుడిపై మరోసారి ల్యాండింగ్ అయింది. భారతదేశం మొత్తాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా గగనతలంలో తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తోంది. ఈ చంద్రయాన్ 3 గురించి ఇస్రో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందిస్తున్నారు. చంద్రయాన్-3 గురించి ఇస్రో ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తోంది.

అయితే.. చంద్రయాన్-3 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ కు అప్పగించిన లక్ష్యాలను అధిగమించిందని ఇస్రో వెల్లడించింది. సైంటిస్టుల ఆదేశానుసారం ఇంజిన్లను మండించి దాదాపు 40CM వరకు పైకి లేచిందని, 30-40CM పక్కన సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. మానవ మిషన్లు సురక్షితంగా తిరిగి రావడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ల్యాండర్ లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయంటూ ఓ వీడియోను ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version