టీటీడీ శిల్పకళాశాలలో 3 రోజుల సెమినార్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమాన

-

టీటీటీడీ శిల్పకళాశాలలో మూడు రోజుల సెమినార్ ప్రారంభించారు టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర రెడ్డి. కళంకారీ రాష్ట్ర కళగా ప్రకటింపచేస్తానని.. 30 వేల సంవత్సరాల క్రితమే శిల్పకళ ప్రారంభమైనదని వెల్లడించారు టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర రెడ్డి. కళల్లో శిల్పకళకు చాలా గొప్ప స్థానం ఉందని.. పూర్వం ఉన్నంత గౌరవం ఈ కళకు లేదని వెల్లడించారు.

TTD Chairman Bhumana started the 3-day seminar at TTD Art Gallery

క్రీస్తు పూర్వమే ఆలయాలకు, ప్రార్థనా మందిరాల నుండి ఈ కళ ప్రారంభమైందని.. ప్రపంచంలో ప్రతి దేశంలో చరిత్రకు ఆధారభూతమైంది శిల్పకళ అంటూ పేర్కొన్నారు. శిల్పకళ విద్యార్థుల నైపుణ్యం కంటే గొప్పది ఏదీ లేదు… 17 సంవత్సరాల క్రితం ఈ కళాశాల దుస్ధితి చూసి సామూహిక మార్పులు చేశానని వెల్లడించారు.

నేను చైర్మన్ గా దిగిపోయే ముందు ప్రతి విద్యార్ధి ద్వారా అర అడుగు, అడుగు మేర శ్రీవెంకటేశ్వర స్వామి ప్రతిమలు తయారు చేయించాలని అనుకున్నానని… ఇన్నాళ్లకు స్వామి వారు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర రెడ్డి. మూడు రోజుల సెమినార్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యతను మరింత పెంచుకోవాలని.. భవిష్యత్తు శిల్పకళాకారులదే కానుందన్నారు. కలంకారిని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కళగా ప్రకటించేలా ముఖ్యమంత్రిని ఒప్పిస్తానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version