అదే జరిగితే చంద్రయాన్-3 ల్యాండింగ్‌ తేదీ మార్పు: ఇస్రో

-

భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 రోజుకో అడుగు ముందుకెళ్తోంది. తాజాగా చంద్రయాన్-3 ల్యాండర్‌ విక్రమ్‌ జాబిల్లిపై అడుగుపెట్టడానికి సర్వం సన్నద్ధమైంది. ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై అనువైన ప్రదేశంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ల్యాండర్‌ అన్వేషణ మొదలుపెట్టింది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై విక్రమ్‌ కాలుమోపనుంది.

అయితే ల్యాండర్‌ మాడ్యూల్‌కు సంబంధించి ఏవైనా ప్రతికూల అంశాలు తలెత్తితే చంద్రుడిపై ల్యాండింగ్‌ను ఆగస్టు 27కి మార్చనున్నట్లు ఇస్రో తెలిపింది. మాడ్యూల్‌ స్థితి, చంద్రుడికి సంబంధించి ప్రతికూల పరిస్థితులు బట్టి ల్యాండింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఆగస్టు 23న చంద్రుడిపై ఉపరితలంపై ల్యాండర్‌ దిగే రెండు గంటల ముందు ఒకసారి పరిశీలిస్తామని వెల్లడించింది. ల్యాండర్‌ స్థితిగతులు, చంద్రుడిపై పరిస్థితులను ఒకసారి అంచనా వేసి.. అప్పుడు నిర్ణయం తీసుకుంటామంది. ఒకవేళ ఆగస్టు 23న విక్రమ్‌ దిగేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆగస్టు 27కు దాన్ని మారుస్తామని ఇస్రో శాస్త్రవేత్త తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version