చంద్రయాన్ 3 ప్రయోగానికి సర్వం సన్నద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఇస్రో చందమామ దగ్గరికి చంద్రయాన్-3ని పంపించనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ ప్రయోగానికి సంబంధించిన చర్చే జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రయాన్-3 ప్రయోగం ట్రెండింగ్‌లో ఉంది. ఇక సైకత శిల్పి సుదర్శన పట్నాయక్ .. చంద్రయాన్ నమోనా శిల్పాన్ని రూపొందించారు. పూరీ బీచ్‌లో ఆయన సైకత శిల్పాన్ని క్రియేట్ చేశారు. సుమారు 22 ఫీట్ల పొడువుతో .. చంద్రయాన్-3 సాండ్ ఆర్ట్ వేశారు. దీని కోసం ఆయన 500 స్టీల్ గిన్నెలను వాడారు. విజయీ భవ అంటూ ఆ సైకత శిల్పపై సందేశం రాశారు.
చంద్రుడిపై మూడవ ప్రయత్నంగా ఇండియా ల్యాండర్‌ను దించాలనుకుంటోంది. ఇవాళ మధ్యాహ్నం 2.35 నిమిషాలకు ఎల్వీఎం3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ మిషన్‌ను చేపట్టనున్నారు. దీని కోసం నిన్న కౌంట్ డౌన్ ప్రారంభించారు. L110 స్టేజ్‌కు చెందిన ప్రొపెల్లంట్ నింపడం పూర్తి అయినట్లు పేర్కొన్నది. ఇక సీ25 స్టేజ్ కోసం ఫిల్లింగ్ ప్రారంభమైనట్లు ఇస్రో వెల్లడించింది.
#WATCH | Renowned sand artist Sudarsan Pattnaik created a 22 ft long sand art of Chandrayaan 3 with the installation of 500 steel bowls with the message "Bijayee Bhava", at Puri beach in Odisha, yesterday.
The Indian Space Research Organisation's third lunar exploration mission,… pic.twitter.com/Gr4SNEZDEy
— ANI (@ANI) July 13, 2023