చంద్రయాన్-3 ల్యాండింగ్.. HD వీడియో విడుదల

-

చంద్రయాన్-3 గురించి ఇస్రో ఎప్పటికప్పుడు వీడియోలు షేర్ చేస్తోంది. ఆగస్టు 23న ల్యాండర్ మాడ్యూల్… చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే HD వీడియోను ఇస్రో వెబ్సైట్ లో ఉంచింది. ల్యాండర్ వేగంగా దూసుకొచ్చి, ఆ తర్వాత నెమ్మదిగా ల్యాండ్ అవ్వడాన్ని వీడియోలో చూడొచ్చు.

అలాగే ల్యాండ్ అయిన తర్వాత అందులో నుంచి రోవర్ బయటకు రావడం కూడా కనబడుతుంది. ల్యాండర్ ఇమేజ్ కెమెరా ఈ వీడియో తీసిందని ఇస్రో పేర్కొంది. కాగా, చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి పేరు పెట్టారు ప్రధాని మోడీ. చంద్రుడిపై చంద్రయాన్-3 లాండర్ దిగిన ప్రాంతానికి శివ్ శక్తి అనే పేరు పెడుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందన సభలో ఈ మేరకు నామకరణం చేశారు ప్రధాని మోదీ.

Read more RELATED
Recommended to you

Latest news