కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు

-

ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించగా.. తదనుగుణంగా పలు కేబినెట్ కమిటీల్లో తాజాగా మార్పులు చేశారు. కేబినెట్ కమిటీల్లో కొత్త మంత్రులకు అవకాశం కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో స్మృతి ఇరానీ, శర్వానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్‌, వీరేంద్రకుమార్‌, గిరిరాజ్‌సింగ్‌, అర్జున్‌ ముండా, మన్‌సుఖ్‌ మాండవీయలకు చోటు దక్కింది.

రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వం వహిస్తున్న పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో అనురాగ్‌ ఠాకూర్‌, కిరణ్‌ రిజిజు, వీరేంద్ర కుమార్‌లకు చోటు కల్పించారు. పెట్టుబడులు, పెరుగుదలకు సంబంధించిన కమిటీలో నారాయణ్ రాణే, జ్యోతిరాదిత్య సింధియాలకు స్థానం లభించగా… ఎంప్లాయ్మెంట్ , స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో జి.కిషన్ రెడ్డి, అశ్విని చౌబే, భూపేందర్ యాదవ్, ఆర్సీపీ సింగ్ లు సభ్యులుగా నియామకం అయ్యారు. ఇక దేశ భద్రతకు సంబంధించిన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కమిటీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి జైశంకర్ సుబ్రహ్మణియన్‌ కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version