లవర్ దూరం పెట్టిందని.. క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్లతో మైనర్ రివేంజ్!

-

సాధారణంగా అమ్మాయిలు తమ ప్రేమను రిజెక్ట్ చేస్తే కొంతమంది అబ్బాయిలు తట్టుకోలేరు. ప్రేమ పేరుతో కోపంలో ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడిన వారెందరో. అయితే తాజాగా చెన్నైలో ఓ మైనర్ బాలుడు (17) ట్యూషన్ టీచర్ (22)తో ప్రేమలో పడ్డాడు. అయితే ఇటీవలి ఆమె ఆ బాలుడిని దూరంగా పెట్టిందట.

ఆ కోపంతో టీచర్పై పగ తీర్చుకోవాలనుకున్నాడతను. దాని కోసం వినూత్న పద్ధతిలో వేధింపులకు పాల్పడ్డాడు. ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి చిరునామాకు వందలాది క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆన్‌లైన్‌ ఆర్డర్లు, 77 సార్లు ఓలా, ఊబర్‌ రైడ్స్‌ను బుక్‌ చేశాడు. ఆ ఆర్డర్స్‌తో వచ్చేవారికి సమాధానం చెప్పలేక ఆమె కుటుంబం సతమతమైంది.

చివరకు ఈనెల 2వ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఎవరో గుర్తుతెలియని ఫోన్‌ నంబరు నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్‌ నంబరు, ఈ మెయిల్‌ ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేసి.. రెండు  సెల్‌ఫోన్లు, వైఫై రూటర్‌ను సీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version