సీజేఐ జస్టీస్ సంజీవ్ ఖన్నా.. మొదటి రోజే 45 కేసుల విచారణ

-

జస్టీస్ సంజీవ్ ఖన్నా భారత 51వ ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటి రోజే ఆయన 45 కేసులను విచారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించిన తరువాత సీజేఐ హోదాలో తొలిసారి కోర్టు హాల్ లోకి అడుగుపెట్టిన జస్టీస్ సంజీవ్ ఖన్నాకు అక్కడున్న న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పదవీ కాలం ఫలవంతంగా సాగాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, తదితరులు ఆకాంక్షించారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ సీజేఐ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల వరకు సీజేఐ జస్టీస్ సంజీవ్ ఖన్నా.. లిస్ట్ చేసిన 45 అంశాలపై విచారణ జరిపారు. వీటిలో వాణిజ్య పరమైన వివాదాలకు సంబంధించినవే అధికం అన్నారు. సీజేఐగా జస్టీస్ డీ.వై. చంద్రచూడ్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలోకి కొత్త సీజేఐగా జస్టీస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది మే 13 వరకు ఈ పదవీలో ఆయన కొనసాగనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version