మదర్సాలలో జాతీయ గీతం ఆలపించాల్సిందే కీలక నిర్ణయం తీసుకున్న సీఎం యోగీ

-

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దులో ఉన్న గుర్తింపు లేని మదర్సాలపై ఆపరేషన్ మొదలుపెట్టారు యోగీ. గుర్తింపు లేని మదర్సాల స్థితిగతులను, ముఖ్యంగా వాటి ఆదాయ వనరులను గుర్తించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.సరిహద్దులోని 9 జిల్లాలను సందర్శించి పూర్తి స్థాయి నివేదికలను రూపొందించడం ఈ అధికార బృందం బాధ్యత. నివేదికలోని అంశాలను బట్టి వాటిపై చర్యలు తీసుకునే అవకాశం ఇది. అయితే సీఎం యోగీ చేపట్టిన ఈ తాజా కార్యక్రమం పై పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు.

గతేడాది యోగీ ప్రభుత్వం మదర్సాలపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పెద్ద సంఖ్యలో గుర్తింపు లేని మదర్సాలు ఉన్నట్లు తేలింది.ఇందులో సుమారు ఎనిమిదిన్నర వేల మదర్సాలకు గుర్తింపు లేనట్లు అధికారులు నిర్దారించారు. అంతేకాదు ఈ సర్వేలో జకాత్ (విరాళం) ఈ మదర్సాల ఆదాయ వనరుగా చెప్పబడింది. కొన్ని మదర్సాలకు విదేశాల నుంచి కూడా డబ్బులు వస్తున్నాయని తేలింది. ఈ సారి సర్వే చేస్తున్న అధికారులు ప్రధానంగా మదర్సాల ఆదాయ వనరులపై అరా తీస్తున్నారు.బలరాంపూర్, సిద్ధార్థనగర్, మౌ, బహ్రైచ్, శ్రావస్తిలో పిలిభిత్, అజంగడ్,లఖింపూర్ ఖేరీ వంటి ప్రాంతాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు.జులై 15 నాటికి సర్వే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

ఓ వైపు సర్వే జరుగుతుండగా ముఖ్యమంత్రి యోగీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మదర్సాలలో జాతీయ గీతం ఆలపించాలని ఇదివరకే సీఎం చెప్పి ఉన్నారు.తరగతుల ప్రారంభానికి ముందు జనగణమన గీతం ఖచ్చితంగా పాడాలని గతంలో ఆదేశాలిచ్చారు.విద్యార్థుల్లో జాతీయ ఐక్యతను ఈ విధానం తీసుకువస్తుంది అనేది సీఎం అభిమతం. అయితే ఈ ఆదేశాన్ని మదర్సాలు పాటిస్తున్నాయో లేదో గమనించాలని అధికారులకు మరోసారి గుర్తు చేశారు ముఖ్యమంత్రి.ఆదేశాలు పాటించని మదర్సాలపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.అలాగే మదర్సాలపై జాతీయ జెండా ఎగరాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version