డ్రగ్స్ కేసులో విచారించబడ్డ హీరోయిన్స్ వీళ్ళే..!

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఒకే ఒక్క విషయం డ్రగ్స్.. నిర్మాత కేపీ చౌదరి ఇటీవల డ్రగ్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ విషయం అందరికీ తెలిసిందే. దీంతో పలువురు సినీ తారల పేర్లు, వ్యాపారవేత్తల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో కూడా స్టార్ హీరోయిన్స్ కూడా ఈ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నవారు ఉన్నారు వారెవరో ఇప్పుడు చూద్దాం.

దీపికా పదుకొనే.. సుశాంత్ సింగరాజ్ పుత్ సూసైడ్ కేసు డ్రగ్ కేసుగా పరిణామం చెందగా .. ఈ కేసులో దీపికా పదుకొనే పేరు కూడా వినిపించింది. ఈమెను ముంబై ఎన్సిబీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈమె కూడా డ్రగ్స్ తీసుకుందా అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఏకంగా రెండుసార్లు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంది. టాలీవుడ్ లో ఆమె పేరు వినిపించగా భిన్న సందర్భాలలో అటు హైదరాబాదు, ఇటు ముంబై అధికారులు ఆమెను విచారించారు.

సుశాంత్ సింగ్ ప్రేయసి రియా చక్రవర్తి కూడా డ్రగ్ కేసులో అరెస్ట్ అయింది. ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తి తో పాటు పలువురిని డ్రగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీరితోపాటు సారా అలీ ఖాన్ , సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లవర్స్ లో ఒకరిగా వార్తల్లోకెక్కిన సుశాంత్, సారా అలీ ఖాన్ కొన్నాళ్లు సన్నిహితంగా ఉన్నారన్న వాదన కూడా వినిపించింది. ఇక ఈ క్రమంలోనే సుశాంత్ మరణం తర్వాత డ్రగ్ ఆరోపణలలో ఆమె కూడా విచారణ ఎదుర్కొన్నారు. ఇక శ్రద్ధ కపూర్ కూడా ఈ డ్రగ్ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక వీరితోపాటు సంజనా గల్రాని , ఛార్మీ కౌర్ వంటి వారు కూడా డ్రగ్స్ విచారణలో ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version