దేశ ప్రజలకు గుడ్ న్యూస్. బుల్లెట్‌లా దూసుకుపోయే హైస్పీడ్ రైళ్లు.. త్వరలోనే రంగంలోకి వస్తున్నాయి.280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రైల్వే శాఖ తీర్చిదిద్దుతోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారీ పనులు…కొనసాగుతున్నాయి.
ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన చేశారు.BEMLతో కలిసి వీటిని తయారు చేస్తున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్… కీలక విషయాలు తెలిపారు. ట్యాక్సులు మినహాయించి.. ఒక్కో బోగీకి రూ.28 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.
ఇక ఈ బుల్లెట్ ట్రైన్ లో అనేక రకాల ఫీచర్స్ ఉంటాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ బుల్లెట్ ట్రైన్స్ గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తాయని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. స్పీడ్ గా వెళ్లే రైళ్ల ద్వారా ప్రజలకు.. చాలావరకు మేలు జరుగుతుందని తెలిపారు. సమయాన్ని మనం.. ఈ రైలు ద్వారా వినియోగించుకోవచ్చు అని కూడా గుర్తు చేశారు.