జమ్మూకశ్మీర్ లో 40 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది. అటు 29 స్థానాల్లో ముందంజలో బీజేపీ ఉంది. అటు 5 స్థానాల్లో పీడీపీ, 11 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు. 10 స్థానాల్లో ఆధిక్యంలో స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
ఇక అటు జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్+ఎన్‌సీ ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు 93 కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తూన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, కేంద్ర బలగాల మోహరింపు ఏర్పాటు చేశారు అధికారులు.