భారత స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగాట్, బజరంగ్ పూనియా నేడు కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దినేష్ రైల్వేలో ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తనపై రెజ్లర్ల ఆరోపణల వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర స్పష్టమైందని అన్నారు డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్.
కాంగ్రెస్ నేత భూపేంధర్ హుడా, ఆయన కుమారుడు దీపేందర్ హుడా ఈ కుట్ర రచించారని ఆరోపించారు. దీనిపై గతంలోనే చెప్పానని.. ఇప్పుడు దేశం కూడా అదే చెబుతుందని, ఇక చెప్పాల్సిందేమీ లేదన్నారు.
అయితే గతంలో రెజ్లింగ్ బాడీ చీఫ్ గా ఉన్న సమయంలో బిజెపి నేత బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు వినేష్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లాంటివారు ఆందోళనలు చేశారు. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనకి లోక్సభ ఎన్నికలలో బిజెపి టికెట్ కూడా నిరాకరించింది.