తెలంగాణ విద్యార్థులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా అంతా కృషి చేయాలని సూచించారు. పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని తెలిపారు. ఇంకా బోధన, ఇతర సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు.
హాస్టళ్లలో సరుకుల సరఫరా సరిగ్గా లేకపోతే టెండర్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. కొందరూ చిన్న చిన్న సమస్యలను బూతద్దం లో పెట్టి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బ తీసేలా కొందరు వ్యవహరిస్తున్నారు. టీచర్లు, వార్డెన్లు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవరించాలి. మానవత్వాన్ని జోడించి మంచి విద్యను నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు. మీ కృషే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని మంత్రి సీతక్క తెలిపారు.