ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌దే హవా : పీపుల్స్‌ పల్స్‌

-

ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌దే హవా కొనసాగుతుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ పేర్కొంది. ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించాయి. పీపుల్స్ పల్స్ ప్రీపోల్‌ సర్వే ప్రకారం.. కాంగ్రెస్‌ పార్టీ 55-60, బిజెపి 29-34, బిఎస్పి, ఇతరులు 1-2 సీట్లు ఛత్తీస్‌ఘడ్‌లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్‌పల్స్‌ నిర్వహించిన ప్రీపోల్‌ సర్వేలో వెల్లడి అయింది. కాంగ్రెస్‌పార్టీకి 47 శాతం, బిజెపికి 42 శాతం, ఇతరులకు 11 శాతం ఓట్లు ఛత్తీస్‌ఘడ్‌లో వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్‌ ప్రీపోల్‌ సర్వేలో తెలిపింది.

ఛత్తీస్‌ఘడ్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్‌భగేల్‌. కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని పేర్కొంది పీపుల్స్ పల్స్. బిజెపిలోని నాయకత్వం అనిశ్చితి కాంగ్రెస్‌కు మేలు చేకూరుస్తుంది.రెండు విడతల్లో జరగనున్న ఛత్తీస్‌ఘడ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 46 సీట్లను సునాయాసంగా దాటుతుందని పీపుల్స్‌పల్స్‌ ప్రీపోల్‌ సర్వేలో వెల్లడించింది. అక్టోబర్ 15 నుంచి 31 అక్టోబర్‌ 2023 వరకు రెండు వారాల పాటు ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో 6120 శాంపిల్స్‌తో పీపుల్స్‌పల్స్‌ సంస్థ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version