కేసీఆర్, హరీశ్ రావులకు ఏపీ మంత్రి అమర్నాథ్ కౌంటర్

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తారు. ఓవైపు అధికార బీఆర్ఎస్.. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఓవైపు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేస్తూనే.. మరోవైపు ఏపీలోని కాంగ్రెస్, వైసీపీ, టీడీపీలపై కూడా విమర్శిస్తోంది.

దీంతో ఏపీ నాయకులు కూడా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ని కించపరచడం సరికాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై మండిపడ్డారు. ముఖ్యంగా ఏపీ పథకాలను తెలంగాణ కాపీ కొడుతుందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడాలి. కానీ ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్టు కేసీఆర్, హరీశ్ రావు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం సబబు కాదు అని అమర్నాథ్ ఫైర్ అయ్యారు. ఇటీవలే పాలేరు సభలో సింగిల్ రోడ్డు వస్తే ఏపీ.. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version