కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి.. నాడు అంబేడ్కర్‌ను విమర్శించి నేడు రాజ్యాంగాన్ని కాపాడాలంటూ !

-

కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నట్లు… రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ సమస్యనైనా పరిష్కరించే విషయంలో.. మొదటినుంచి కాంగ్రెస్ విఫలం అవుతుందని అంటున్నారు. గతంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం… రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదాన్ని ఎత్తుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్… ఇప్పుడు రాజ్యాంగం పేరుతో కొత్త నాటకాలు ఆడుతోందని అంటున్నారు.

rahul
rahul

రాజ్యాంగంపై కాంగ్రెస్ భిన్నాభిప్రాయాలు

కాంగ్రెస్ అలాగే అంబేద్కర్ మధ్య సైద్ధాంతిక విభేదాలు అప్పట్లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. 1930లో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని అంబేద్కర్ డిమాండ్ చేస్తే మహాత్మా గాంధీ వ్యతిరేకించాడు. దీనికి నిరసనగా నిరాహార దీక్షకు కూడా గాంధీ దిగడం జరిగింది. దీంతో అంబేద్కర్ ఒత్తిడికి గురై… పూనా ఒప్పందంపై సంతకం కూడా చేశారు. రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్ అయినప్పటికీ… కాంగ్రెస్ పార్టీ మాత్రం అతన్ని పట్టించుకోలేదు. రాజ్యసభకు చాన్స్ ఇవ్వలేదు. ఆయనను అణగదొక్కింది.

నెహ్రూ వర్సెస్ అంబేద్కర్ మధ్య రచ్చ ?

గాంధీతో అంతర్గత పోరాటం చేసిన అంబేద్కర్… ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ తో కూడా.. చాలా కష్టపడ్డాడని చెబుతారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా, న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. నెహ్రూ మంత్రివర్గం నుంచి ఈ వ్యతిరేకత ఎక్కువగా వచ్చింది. రిజర్వేషన్ల శాశ్వతత్వం పై నెహ్రు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఈ వాదనలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నారు. హిందూ వ్యక్తిగత చట్టాలను సంస్కరించడానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారు.

కానీ హిందూ కోడ్ బిల్లును నెహ్రూ ప్రభుత్వం మధ్యలోనే ఆపేసింది. దీంతో 1951లో తన పదవికి అంబేద్కర్ కూడా రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్… అంబేద్కర్ పై అభ్యర్థులను నిలబెట్టి ఓడించేందుకు కుట్రలు చేసింది. అంబేద్కర్ కు వ్యతిరేకంగా ఉన్న దళిత నాయకులను ప్రోత్సహించింది కాంగ్రెస్. ఇలా ప్రతి విషయంలో కూడా అంబేద్కర్ కు వ్యతిరేకంగానే… కాంగ్రెస్ వ్యవహరించింది.

మోడీ ప్రభుత్వంలో అంబేద్కర్ జపం చేస్తున్న కాంగ్రెస్

గతంలో అంబేద్కర్ ను పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం ఆయన రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తుంది. మోడీ ప్రభుత్వంలో.. భారతదేశంలో పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ వితండవాదాన్ని వినిపిస్తోంది. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగించాలని… ప్రతిపక్ష పార్టీ నాయకుల డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ కొత్త వాదన తీసుకువచ్చింది. అయితే ఇదే సమయంలో అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిన విషయాన్ని పదేపదే బిజెపి నేతలు కూడా గుర్తు చేస్తున్నారు. బతికున్నప్పుడు అంబేద్కర్ను పట్టించుకోలేదు కానీ.. అధికారం కోసం కాంగ్రెస్ ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని వాడుకుంటుందని ఫైర్ అవుతున్నారు బిజెపి నేతలు. అంబేద్కర్ రాజ్యాంగం విషయంలో… బిజెపి గట్టి కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ టీం.. దిక్కుతోచని పరిస్థితిలో పడిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news