భారత్లో కరోనా బారిన పడిన 4 వేల మంది.. 63 జేఎన్1 వేరియంట్ కేసులు

-

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుున్నాయి. తాజాగా భారత్లో కొవిడ్‌ క్రియాశీలక కేసులు 4 వేలు దాటాయి. మరోవైపు న్యూ వేరియంట్ జేఎన్‌.1 కేసులూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 628 కొత్త కేసులు నమోదవ్వగా.. క్రియాశీలక కేసులు 4,054 ఉన్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ కొత్త ఉపరకం జేఎన్‌.1 కేసులు ఆదివారానికి 63కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వీటిలో గోవాలో 34, మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య పెరగటం లేదని, దాని బారిన పడినవారిలో 92 శాతం మంది ఇంట్లో ఉండే చికిత్స పొందుతున్నారని పేర్కొన్నాయి. కేరళలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించాయి.

కొత్తగా వెలుగులోకి వచ్చిన 628 కొవిడ్‌-19 కేసుల్లో అత్యధికం కేరళ (376) నుంచే. తర్వాత స్థానాల్లో కర్ణాటక (106), మహారాష్ట్ర (50), తమిళనాడు (29), రాజస్థాన్‌ (11), తెలంగాణ (8), ఉత్తర్‌ప్రదేశ్‌ (7), దిల్లీ (7), గుజరాత్‌ (6), ఆంధ్రప్రదేశ్‌ (5) రాష్ట్రాలు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news