ఢిల్లీలో కరోనా కేసులు పెరగడంపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రెండో వేవ్ అని పిలవడంపై ఆయన స్పందించారు. “ఇది రెండవ వేవ్ అని మీరు చెప్పలేరు. ఒకటి లేదా రెండు నెలలు పాజిటివ్ కేసులు లేనట్లయితే మేము దానిని రెండవ వేవ్ అని పిలుస్తామని ఆయన స్పష్టం చేసారు. కొన్ని రోజుల తరువాత ఢిల్లీలో కేసులు మళ్ళీ పెరిగాయని ఆయన పేర్కొన్నారు.
మా రాష్ట్రాన్ని కరోనా వదిలిపెట్టలేదని, ఇంకా వైరస్ ఉందని ఆయన అన్నారు. దేశ రాజధానిలో 2,509 తాజా కేసులు నమోదయ్యాయి, దాదాపు రెండు నెలల్లో అత్యధిక కరోనా కేసుల పెరుగుదల ఇదే. నగరంలో 1,79,569 మందికి వ్యాధి సోకింది, 19 మంది తాజా మరణాలు నమోదు అయ్యాయి. మొత్తం మరణాలు 4,481 కు చేరుకున్నాయి. కరోనా పరీక్షలను పెంచుతున్నామని, పరిక్షలకు ఉన్న ప్రాధాన్యత తమకు తెలుసు అని అన్నారు.