మన శత్రు దేశమైన చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి కేసులు.. మన ఇండియాలో క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంట ల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2,323 నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,34,422 కు చేరింది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2346 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.99 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 25 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,348 కి చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 14,996 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,92,12,96,720 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 15,32,383 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,94, 801 కు చేరింది.
COVID19 | 2,323 new cases recorded in India in the last 24 hours; Active caseload at 14,996 pic.twitter.com/Mx7ACCKi3F
— ANI (@ANI) May 21, 2022