సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌నూ వదలని సైబర్ నేరగాళ్లు..

-

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాజిక మాద్యమాల ద్వారా పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్న వీరు పేరుమోసిన వ్యక్తులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను సైతం టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే వీరు ఉచ్చులో చిక్కుకుని దేశవ్యాప్తంగా చాలా మంది లక్షల్లో డబ్బులు పొగొట్టుకున్నారు.సైబర్ నేరగాళ్ల బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

దేశవ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్లలో సైబర్ క్రైమ్స్ కేసుల సంఖ్య సైతం పెరుగుతూ వస్తున్న తరుణంలో తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను స్కామర్లు టార్గెట్ చేశారు. ఏకంగా ఆయన పేరు మీద సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసి రూ.500 ఇవ్వాలని ఓ స్కామర్ అడిగినట్లు తెలుస్తోంది.

ఈ విషయం వెలుగులోకి రావడంతో సుమోటోగా తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ఈ ఘటన మీద కేసు పెట్టింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సైబర్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాల పోలీసులు సామాన్యులను అప్రమత్తం చేస్తున్న తరుణంలో ఏకంగా సుప్రీం చీఫ్ జస్టిస్‌ను స్కామర్లు టార్గెట్ చేయడంతో సామాన్యులు సైతం జంకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version