‘దానా’ తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు..!

-

అండమాన్ సముద్రం నుంచి దూసుకొస్తున్న దానా తుపాను ముప్పు నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈస్ట్ కోస్ట్ పరిధిలో 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.


ఈనెల 23,24వ తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రేపటికి దానా తుఫాన్ ‘బలపడనుందని వెల్లడించింది. రెండు రోజుల పాటు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version