ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరెస్ట్

-

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్ అయ్యారు. నకిలీ పత్రాలతో రాయదుర్గంలోని రూ.వేల కోట్ల విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. దీనిపై 2003లో అప్పటి ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో.. అవి నకిలీ పత్రాలేనని కోర్టు తేల్చింది. దీంతో శివరామకృష్ణతో పాటు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌‌లో పని చేసే చంద్రశేఖర్, మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు.

వాస్తవానికి 2003లో నకిలీ పత్రాలపై కోర్టులో కేసు వేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. హైకోర్టు నుంచి
సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేసింది ప్రభుత్వం. శివరామకృష్ణవి నకిలీ పత్రాలని తేల్చింది సుప్రీంకోర్టు. దీంతో  తీర్పుతో శివరామకృష్ణతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అక్టోబర్ 19న శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు పోలీసులు శివరామకృష్ణ, మహేశ్ బాబుతో యువరాజు, వెంకటేశ్ తో ప్రేమంటే ఇదేరా, రవితేజతో దరువు, యువత, రైడ్, ఏమో గుర్రం ఎగరావొచ్చు, అందరి బంధువయ వంటి పలు సినిమాలు నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version