దేశ రాజధాని నగరం అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతకు రెండు ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉందనే ఆరోపణలపై ఢిల్లీ కోర్టు జూన్ 3న రాజధాని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల అధికారులకు సమన్లు జారీ చేసింది. తూర్పు ఢిల్లీలోని బీజేపీ అభ్యర్థికి రెండు ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలకు స్పష్టమైన కౌంటర్‌గా కనిపిస్తుంది.
ఆమె వద్ద సాహిబాబాద్ (ఘజియాబాద్) & సివిల్ లైన్స్ (చాందినీ చౌక్) ఓటర్ ఐడీలు ఉన్నాయని స్థానిక బీజేపీ నాయకుడు హరీష్ ఖురానా పేర్కొన్నారు. దీంతో తీస్ హజారీ కోర్టులో సీఎం భార్యపై క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతకు ఢిల్లీ కోర్టు నోటీసులు అందజేసింది. సునీతకు రెండు ఓటర్ కార్డులు ఉన్నాయని కోర్టులో పిటిషన్ వేయడంతో ఢిల్లీ హై కోర్టు ఏం నిర్ణయం చెబుతుందనేది తేలాల్సి ఉంది.