ఢిల్లీ పోలీసులు గూగుల్ ని ఆశ్రయించనున్నారు.. కారణం ఏమిటంటే..?

-

ఢిల్లీలో రైతుల నిరసనకి సంబంధించి టూల్ కిట్ డాక్యుమెంట్ విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. జనవరి 26 జరిగిన హింస స్క్రిప్ట్ అని భావిస్తున్నారు. గూగుల్ ని ఐపి అడ్రస్ కోసం ఆశ్రయిస్తున్నారు. దీనితో ఎక్కడి నుంచి దీన్ని అప్లోడ్ చేసారు అనే విషయం తెలుస్తుంది. 300 కి పైగా సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా స్కానర్ కింద ఉన్నాయి. ఇలా దీనితో ఈ విషయాన్ని పరిశీలించనున్నారు.

ఈ టూల్ కిట్ లని సృష్టించిన వాళ్ళ ఉద్దేశం వివిధ సామాజిక, మతం మరియు సాంస్కృతిక సమూహాలతో అసమానతలు సృష్టిస్తోంది. అంతే కాదు ఇది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఎంక్వైరీ లో టూల్ కిట్ గురించి చూస్తే…’ప్రో-ఖలిస్తాని ఆర్గనైజేషన్ “Poetic Justice Foundation” సృష్టించబడి నట్లు తెలుస్తోంది. ఇందులో వివిధ రకాల డాక్యుమెంట్లు కనిపిస్తున్నాయి. యాక్షన్ నుండి చేసిన హింస వరకు ముందుగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది జనవరి 26 లేదా అంతకంటే ముందే ప్లాన్ చెయ్యవచ్చు అని అంచనాలు వేస్తున్నారు.

జనవరి 26 నాటి హింస తో సహా గత కొన్ని రోజులుగా జరిగిన ఈ సంఘటనలని టూల్‌కిట్‌లో వివరించిన ‘కార్యాచరణ ప్రణాళిక’ యొక్క కాపీకాట్ అమలును వెల్లడించాయని పోలీసులు భావిస్తున్నారు. పరువు తీసేందుకు “అంతర్జాతీయ కుట్ర” కింద 124-A, 153-A, 153, 120-B IPC కింద నమోదు చెయ్యాలని అన్నారు. ఇది ఇలా ఉండగా సైబర్ సెల్ ఢిల్లీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు. వీళ్ళు సోషల్ మీడియాలో అన్నిటినీ పరిశీలించడం జరిగింది. అయితే జనవరి 26 జరిగిన హింసాత్మక పోస్టులని పోస్ట్ చేయడం తో హింస బాగా విస్తరించింది. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో కూడా విదేశీ హ్యాండిల్స్ ను పరిష్కరించి అదనపు బాధ్యత కూడా చేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version