కాలుష్య నివారణకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు

-

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో.. కాలుష్య నివారణకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. దేశ రాజాధానిలో “భారత్ స్టేజ్” (బిఎస్)-4 డీజిల్, బిఎస్-3 పెట్రోల్ వాహానాలపై నిషేదాన్ని కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. అలాగే రేపు ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలకు సెలవు ప్రకటించింది. 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం.

రైల్వే, రహదారులు, హైవేలు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. అయుతే, ప్రయువేట్ కట్టడాల నిర్మాణాల పై నిషేదాన్ని మాత్రం కొనసాగిస్తుంది. ఢిల్లీ లో ట్రక్కుల ప్రవేశం పై విధించిన నిషేదాన్ని కూడా ఎత్తివేసింది. “దేశ రాజధాని ప్రాంతం” (ఎన్.సి.ఆర్) లో కాలుష్యం వల్ల ఆరోగ్యం పై ఉండే స్పల్పకాలిక, దీర్ఘ కాలిక ప్రభావంపై ఢిల్లీ వాసుల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు సమీక్షించి కట్టుదిట్టమైన చర్యలు, నిర్ణయాలు కుంటామని భరోసా ఇస్తుంది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version