మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులోని ముగ్గురు నిందితులు తమకు హైకోర్టు రిమాండ్ విధించడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అయితే ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయపరమైన అవసరాల కోసం కోర్టులను వేదికగా చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది.
ఏపీ, తెలంగాణకు చెందిన కేసులు రాజకీయపరంగా ఉంటున్నాయని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది. నిందితుల బెయిల్ కేసులు కింది కోర్టులో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రస్తావించారు. కాగా కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.