అమెరికా నుంచి అక్రమ వలసదారుల ప్రక్రియ కొత్తదేమీ కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. తాజాగా అమెరికా 104 మంది భారతీయులను స్వదేశానికి పంపించడం పై ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి రాజ్యసభలో ప్రకటన చేశారు. వలసదారులకు సంకెల్లు వేసి పంపిస్తున్నారని.. విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. డిపోర్టేషన్ సమయంలో వలస దారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు.
అమెరికాలో ఏళ్ల కాలం నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదు.. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోంది. 212లో ఈ సంఖ్య 530 ఉండగా.. 2019లో 2వేలకు పైగా ఉందని.. అక్రమ వలసలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని.. తమ దేశస్తులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం ఆయా దేశాల బాధ్యత అని జైశంకర్ పేర్కొన్నారు.