కోవిడ్ టీకా తీసుకోవాలని ఒత్తిడి చేయద్దు: సుప్రీంకోర్టు

-

దేశంలో కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.ఇప్పటికే 1,89,23,98,347 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో పేర్కొంది.ఇదిలా ఉండగా దేశంలో వ్యాక్సిన్ లను తప్పనిసరి చేయడం పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది.విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.కోవిడ్ టీకా వేసుకోవాలని ప్రజల పై ఒత్తిడి చేయవద్దు అని కోర్టు పేర్కొన్నది.

FILE PHOTO: A woman holds a small bottle labelled with a “Coronavirus COVID-19 Vaccine” sticker and a medical syringe in this illustration taken October 30, 2020. REUTERS/Dado Ruvic/File Photo

ప్రస్తుత వ్యాక్సినేషన్ విధానం ఏకపక్షంగా ఉందని కూడా చెప్పలేమని స్పష్టం చేసింది.వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి కేంద్రం డేటా ను విడుదల చేయాలని ఆదేశించింది.అలాగే వ్యాక్సినేషన్ చేసుకోకపోతే వారిని పబ్లిక్ ప్రదేశాలకు రానివ్వకపోవడండం కరెక్ట్ కాదని పేర్కొంది.ఈ ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వెల్లడించింది.అనంతరం వ్యాక్సిన్ విషయంలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version